చలో రాజ్ భవన్… ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల అరెస్టు

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాజ్ భవన్ ముట్టడించకుండా కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.

అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరా పార్క్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే నిరసనలకు అనుమతి లేదని, నగరంలో కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్నా చౌక్ చేరుకోకుండా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల వైఖరిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. టిఆర్ఎస్ నాయకులు మీటింగ్ లు పెడితే కన్పించని కరోనా ఆంక్షలు మేము ఆందోళన చేస్తే కన్పిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ జెండాను కట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో రాజ్ భవన్ వరకు ర్యాలీగా చేరుకుంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.