రాయలసీమ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు నష్టం

సిఎం జగన్ కు లేఖ రాసిన ప్రకాశం టిడిపి ఎమ్మెల్యేలు
ఒంగోలు: శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ, రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతున్నదని ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

కరువు జిల్లా గొంతు కోయొద్దని ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు శ్రీ గొట్టిపాటి రవి కుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి, శ్రీ ఏలూరి సాంబశివరావు లేఖ లో వేడుకున్నారు. మీ నిర్ణయ మూలంగా జిల్లా ఎడారిగా మారుతుందని, పంట భూములన్నీ భూగర్భజలాలు, సాగర్ పైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. గత 15 ఏళ్లలో మూడు సంవత్సరాలు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన పన్నెండేళ్ళు కరువే వచ్చిందన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలతో మరింత చేటు చేసేలా ఉంది. శ్రీశైలం నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు సాగర్ నిండితేనే ప్రకాశం జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు. శ్రీశైలం నిండకుండా మీరు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మా కరువు జిల్లా పరిస్థితి ఏమిటి..?. రాయలసీమ ఎత్తిపోతల కోసం 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కుల పెంపు పునరాలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు. గుంటూరు ఛానల్ ను దగ్గుబాడు వరకు పొడిగించి ప్రజల దాహార్తిని తీర్చే, పంటలకు సాగునీరు ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యేలు సిఎం జగన్ ను ఆ లేఖలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.