48 గంటల టి సర్కార్ వెబ్ సైట్లు బంద్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వెబ్ ఫోర్టల్ ద్వారా మరింత వేగంగా ఆన్ లైన్ సేవలను అందించేందుకు ఆధునీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇవాళ (శుక్రవారం) రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఆన్ లైన్ సేవలు నిలిపివేశారు.

స్టేట్ డేటా సెంటర్ (ఎస్.డి.సి) లో సర్వర్లు పాతవి కావడం, పవర్ బ్యాకప్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తరచూ ఆన్ లైన్ సేవల్లో అంతరాయాలు తలెత్తుతున్నాయి. సర్వర్ లో మరమత్తులు, ఆధునీకరణ కోసం డేటా సెంటర్ కు అనుబంధంగా ఉన్న ఆన్ లైన్ సేవలు నిలిచిపోతాయని రాష్ట్ర ఐటి అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సేవలు తిరిగి పునరుద్దరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.