గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107

హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్నది. ఏపిలోని గుంటూరు లో లీటర్ పెట్రోల్ రూ.107.13 కు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.87 కు చేరుకున్నది. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 27 పైసల చొప్పున పెంపుదల చేశారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.91, డీజిల్ ధర రూ.89.88, ముంబయిలో రూ.106.93, రూ.97.47 గా ఉంది. ప్రతి లీటర్ ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుగా భారీగా దోపిడి చేస్తున్నాయి. నలభై శాతం వరకు పన్నులు విధిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ప్రజలపై భారం పడుతున్నా పన్నులు తగ్గించుకోకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల జేబులు కొడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.