రేపు టిఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం పై పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి అంతగా శ్రద్ధ చూపించకపోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.

రేవంత్ రెడ్డి మూలంగా కాంగ్రెస్ పార్టీ ఎదగదని, ఐరన్ లెగ్ అని కౌశిక్ రెడ్డి ఇటీవల ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ కృషితో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. కాళేశ్వరం, ఎల్ఎండి జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని కొనియారు. రైతుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేదని, స్వలాభం కోసమే రాజీనామా చేశారని అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు టిఆర్ఎస్ భవనలో పార్టీలో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.