ఆంధ్రా సర్కార్ వైఖరి సరిగా లేదు: కేసీఆర్

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్రా ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.
నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా, సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జల విద్యుత్ ఉత్పత్తి ని కొనసాగించాలని తెలిపారు. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ కు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రాన్ని వత్తిడిచేస్తూ వస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబి తదితర వేదికల మీద తెలంగాణ ప్రభుత్వ వాదనను వినిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది.

Leave A Reply

Your email address will not be published.