స్కూళ్లలో మాస్క్ తప్పనిసరి: కాలిఫోర్నియా

కాలిఫోర్నియా: కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం స్కూళ్లలో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వ్యాక్సినేషన్ వేయించుకున్న విద్యార్థులు మాస్కు వేసుకోవాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (సిడిపిహెచ్) మరో ప్రకటన చేసింది.

మాస్క్ ధరించాల్సిందేనని, స్కూళ్లకు రెగ్యులర్ గా వచ్చేందుకు మాస్క్ మంచి మార్గమని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాల్సిందేనని, విద్యార్థుల ఆరోగ్య రక్షణే తమ లక్ష్యమని ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.