అగ్రిమెంట్ కుదిరింది… పిసిసి చీఫ్ గా సిద్ధూ?

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. గత కొద్ది రోజులుగా పార్టీ ముఖ్యనాయకులతో చర్చలు జరుపుతున్నది.
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య కాంగ్రెస్ నాయకత్వం రాజీ కుదిర్చినట్లు తెలిసింది.

ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు ముగింపు పలకనున్నది. ఇద్దరి నేతల మధ్య రాజీ కుదిర్చి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నది. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ను ఎన్నికల వరకు కొనసాగిస్తూనే పిసిసి నూతన సారధిగా సిద్ధూను నియమించనున్నారు. మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమిస్తున్నారు. ఒకటి దళితులకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇద్దరు నాయకులు తెలిపారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి హరీశ్ రావత్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.