కోకాపేటలో రూ.1వేయి కోట్ల కుంభకోణం: రేవంత్ రెడ్డి

ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని, సిఎం కెసిఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు జరిగాయని టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గతంలో కూడా రియల్ భూమి పెరినట్లు ప్రచారం చేశారని, రియల్ బూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉందన్నారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాల కోసం స్థలం దొరకదన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కెసిఆర్, మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ అడ్డుకోని నానా రచ్చ చేశారని గుర్తు చేశారు. ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయి. హై హోం కంపెనీ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి. వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ్ పుష్ప 7 ఎకరాలు కొన్నది. ఆక్వా స్పెస్ సంస్థ రూ.390 కోట్లు, రాజ్ పుష్ప సంస్థ రూ.138 కోట్లు లాభం గడించాయని ఆరోపించారు. రూ.3వేల కోట్లు రావాల్సిన భూములను రూ.2వేల కోట్లకే పరిమితం చేశారు. ప్రిస్టేజి సంస్థకు, మంత్రి కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కెటిఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.

50 ఎకరాలు ఉన్న భూమి లో ఎకరానికో రేటు ఎలా ఉంటుంది? అని ప్రశ్న లేవనెత్తారు. ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు రూ.60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు రూ.30 నుంచి రూ.40 కోట్లకు ఎలా ధర పలుకుతుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారు. టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు. టిఆర్ఎస్- కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారన్నారు. కోకాపేట లో ఎకరా భూమి ధర రూ.50 కోట్లకు తక్కువ లేదు. అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1000 కోట్ల లూటీ జరిగింది. గతంలో లిక్కర్ మాఫియా లెక్క- ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపింది. రూ.60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలువాలన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలన్నారు. రాజ్ పుష్ప సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. త్వరలోనే రాజ్ పుష్ప సంస్థ, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి భాగోతం బయపెడుతానని రేవంత్ అన్నారు.
నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి, ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కి కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాను. నేను ఇచ్చే ఫిర్యాదు పై కేంద్రం, బిజెపి విచారణకు అదేశిస్తుందా లేదా చూద్దామన్నారు. ఈ ఫిర్యాదుతో రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం బట్టబయలు అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.