లో దుస్తుల్లో అంత బంగారమా?

చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతని లో దస్తులను పరిశీలించగా రూ.31 లక్షల బంగారం బయటపడింది.

మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం రాత్రి ప్రత్యేక విమానం దుబాయ్ నంచి చేరుకున్నది. పెద్ద మొత్తంలో బంగారం తరలుతున్నట్లు ముందుగానే కస్టమ్స్ అధికారులకు సమాచారం రావడంతో కమిషనర్ రాజన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండ్ కాగానే తనిఖీలు నిర్వహించగా, బసూలుద్దిన్ (26) లో దుస్తుల నుంచి రూ.650 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.