ట్వీట్ ఎఫెక్ట్… స్పందించిన ఢిల్లీ ఏయిర్ పోర్టు

న్యూఢిల్లీ: విమానాశ్రయంలో కనీస వసతుల కల్పనలో ఘోరంగా ఉందంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి చేసిన ట్వీట్ పై ఢిల్లీ ఏయిర్ పోర్టు యాజమాన్యం స్పందించింది.

ఆర్.టి.పి.సి.ఆర్ వివరాల నమోదుకు సంబంధించి కొన్ని ప్రదేశాలు డెస్కులు ఉన్నాయి. మరికొన్ని డెస్కులు పెంచుతాం. ప్రయాణీకులకు కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఏయిర్ పోర్టు ప్రకటించింది. ఏయిర్ పోర్టులో ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షల కోసం నేలపై కూర్చుని, గోడలపై పేపర్లు పెట్టి రాసుకుంటున్నారని రాజమౌళి ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఢిల్లీ ఏయిర్ పోర్టు స్పందించింది.

Leave A Reply

Your email address will not be published.