గజ్వేల్ లో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

 

 

 

రాహుల్ గాంధీ పై మోడీ అనర్హత వేటు వెయ్యడం సిగ్గుచేటని, రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేయడం తో ప్రజలలో రాహుల్ గాంధీ పై నమ్మకం, విశ్వాసం పెరగడంతో బిజెపి జీర్ణించుకోలేదని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు అనే భయంతో, అక్కస్సుతో ఎలాగైనా పార్లమెంటులో రాహుల్ గాంధీ ఉండకూడదు అనే దురుద్దేశంతో ఈ రకమైన దుర్మార్గపు చర్యకు పూనుకుంది మోదీ ప్రభుత్వం అని నిరసన వ్యక్తం చేస్తూ, అప్రజాస్వామిక చర్యలకు నిరాశిస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వెల్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో ని అంబెడ్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షరెడ్డి, నాయిని యాదగిరి, మల్లారెడ్డి, రాజు, శ్రీను, నాగరాజు, యాదగిరి, ఆంజనేయులు, రాములు గౌడ్ మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.