నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో రూ.7.5 లక్షల బీసీ(ముదిరాజ్) కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మరో 7.5 లక్షల నిధుల మంజూరికి ఎమ్మెల్సీ హామీ
:: నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీపీ) నుంచి మంజూరు చేసిన 7.5 లక్షల రూపాయల కు సంబంధించిన బీసీ (ముదిరాజ్) కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జడ్పిటిసి పంజా విజయ్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కి గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికి పెద్దమ్మ తల్లి ఆలయానికి తీసుకువెళ్లి దర్శనం చేయించారు. పెద్దమ్మ తల్లి ఆలయానికి, కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ముదిరాజ్ సంఘ నాయకులు కృషితో ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉండడంపై వారిని ఎమ్మెల్సీ ప్రశంసించారు. అనంతరం కమ్యూనిటీ హాల్ నిర్మాణ ప్రతిపాదిత స్థలానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మరిన్ని నిధులు కావాలని సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంజా విజయ్ కుమార్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచ్ లు శివ ప్రసాద్ రావు, నాగరాజు, ఎంపీటీసీ రాజా రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగం, పీఏసీఎస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మెట్టు సిద్దిరాములు, నాయకుడు గుంల మైసయ్య, మత్స్యకార సంఘం అధ్యక్షుడు మెట్టు వెంకటేశం, ఉపాధ్యక్షుడు పిట్ల మహేష్, నాయకులు గుంల కర్రయ్య, బీఆరెస్ నాయకులు బాబు, తిరుపతి, ఉప సర్పంచ్ సంజీవులు, మల్లేష్ యాదవ్, రంజిత్ రాజ్, తదితరులు ఉన్నారు.