చింతకాయల రాజు కుటుంబానికి అండగా నిలిచిన 2002 పదవ తరగతి బ్యాచ్
అను దిన వార్త పర్వతగిరి జూన్ 17.
వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన చింతకాయల రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, రాజు దశదినకర్మ లో 2002 పదవ తరగతి బ్యాచ్ వర్ధన్నపేట పాఠశాల చెందిన బాల్యమిత్రులు పాల్గొని, వారి కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడవద్దని, అండగా ఉంటామని ఆర్థిక సహాయంగా 15000 రూపాయలు అందజేశారు. మరో6 వేల రూపాయలుఅందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొండేటి బాల కృష్ణ, పి అనిల్, ఎండి యాకోబు పాషా, శ్రీశైలం, వి సుధాకర్, ఎండి మౌలానా, జి సాంబయ్య, బి మహేందర్, బి అశోక్, ఏ సతీష్ మరియు బాల్యమిత్రులు పాల్గొన్నారు.