రెండో రోజు కూడా మద్యం దుకాణాల ముందు చిత్ర విచిత్ర పరిస్థితులు.. ఫొటోలు ఇవిగో
దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆ షాపుల ముందు నిన్న కనపడిన హంగామా అంతాఇంతా కాదు. రెండో రోజు కూడా మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరి నిలబడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు చిత్ర విచిత్ర పరిస్థితులు కనపడ్డాయి. పలు రాష్ట్రాల్లో మద్యం రేట్లు పెంచేసినప్పటికీ మందుబాబులు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడట్లేదు. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల ముందు నిన్న నిబంధనలు పాటించకపోవడంతో ఆయా షాపులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Tags: India,Lockdown,Corona Virus