కళ్ళ అద్దాల పై కరోనా .?

షాకింగ్ న్యూస్ చెప్పిన వైద్యులు: కళ్ళద్దాల పై కరోనా... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తున్న దో చెప్పక్కర్లేదు. దేన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అని నిత్యం ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఏ వస్తువు పై వైరస్ ఎంత కాలం బతికి ఉంటుందనే విషయం పై ఇప్పటికే యూనిసెఫ్ కొన్ని విషయాలు పేర్కొన్నది. గాలిలో నుంచి వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించ లేదని, వస్తువులపై వైరస్ 12 గంటలకంటే ఎక్కువ కాలం బతికి ఉండదని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే,కరోనా వైరస్ కళ్ళద్దాలు పై ఎంతకాలం ఉంటుందనే విషయంపై వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మనం వాడే కళ్ళద్దాల పై వైరస్ 9 రోజుల వరకు బతికి ఉంటుందనే చెబుతున్నారు. బయటకు వెళ్లే సమయంలో ఎప్పటికప్పుడు కళ్లద్దాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే,కళ్ళ అద్దాలను శానిటైజర్ తో శుభ్రం చేయకూడదని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రం చేయడం ఉత్తమమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కళ్ళద్దాలు వాడే వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.