వినూత్న పోస్టులతో… పోలీసుల వినూత్న ప్రచారం

ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా ట్రై కమిషనరేట్‌ల పరిధుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీసులు రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సోషల్‌మీడియాను వేదికగా చేసుకొని వినూత్న పోస్టులతో వాహనదారులను చైతన్యపరుస్తున్నారు. లెజెండ్‌ సినిమాలో ‘నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి... కాదని ఏది పనిచేసినా నీకు నెక్స్ట్‌ బర్త్‌డే ఉండదు’ అంటూ బాలకృష్ణ పలికే డైలాగ్‌ను కొద్దిగా మార్చి.. పండగలని, పబ్బాలని, సెలవలని తాగి బండి నడిపితే నీకు నెక్ట్స్‌ బర్త్‌డే ఉండదు... అంటూ బాలకృష్ణ డైలాగ్‌ డెలివరీ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి డ్రంకెన్‌ డ్రైవ్‌పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.