గొడవ సద్దుమణిగేనా..?

గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఏపీ, కర్ణాటక సరిహద్దులు గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. పదేళ్ల క్రితం ఇనుప ఖనిజ మైనింగ్ అక్రమాలు రెండు రాష్ట్రాల్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించాయి. ఇనుప ఖనిజ తవ్వకాల్లో వేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ తో పాటు పలు కంపెనీలపై విచారణ సాగింది. సిబిఐ కూడా దీనిపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఇంకా నడుస్తోంది. అయితే అప్పట్లో అక్రమార్జన ధ్యేయంగా ఏపీ కర్ణాటక సరిహద్దులను సైతం చెరిపేశారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం ప్రాంతంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు ఉంది. అయితే ఇదే ప్రాంతంలో మైనింగ్ జరిగింది. పరిమితులకు మించి మైనింగ్ చేస్తూ రెండు రాష్ట్రాల సరిహద్దులను అప్పట్లో పలు కంపెనీలు మైనింగ్ నిర్వహించాయి. దీనిపై గత పదేళ్లుగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్వే ఆఫ్ ఇండియా సరిహద్దులు నిర్ణయిస్తుందని దీనికి రెండు రాష్ట్రాల వారు కట్టుబడి ఉండాలని సూచించింది. రెండేళ్లుగా సర్వే ఆఫ్ ఇండియాతో పాటు రెండు రాష్ట్రాల అధికారులు ఈప్రాంతంలో పలుమమార్లు సర్వేలు నిర్వహించారు. ఇవాల్టి నుంచి ఇరురాష్ట్రాల సరిహద్దుల గుర్తింపు, పిల్లర్లనిర్మాణం చేపడుతున్నారు. అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ నిశాంత కుమార్ ను ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించింది.

Leave A Reply

Your email address will not be published.