ఎవరు వస్తారో రండి.. జగన్ అయినా ఇంకెవరైనా.. కాలువ సవాల్
సీఎం జగన్ అయినా సరే…. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అయినా సరే…ఎవరైనా సరే రండి అని సవాల్ అన్నారు.. మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు. రాయలసీమ ప్రాంతంలో పంటలు తీవ్రంగా నష్టపోయి… రైతులను అల్లాడి పోతుంటే… ప్రభుత్వం దగ్గర కనీస సమాచారం కూడా లేదని ఆయన మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్నీ అందిస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఏ రైతు భరోసా కేంద్రం లో అయినా రైతులు ఎంత పంట వేశారు.. ఎంత నష్టపోయారు అన్న వివరాలు ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ సచివాలయంకు అయినా వచ్చేందుకు సిద్ధమని అన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు రేపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..