అక్కడ కిలో పూలు 1400….ఇవేం పూలు రా బాబోయ్
సాధారణంగా పండగొస్తే పూల ధరలు భారీగా పెరుగుతాయి. కానీ అక్కడ ఏకంగా 1400 నుంచి 1500 రూపాయల వరకు పలుకుతోంది. ఇంతకీ అంత ధర ఇక్కడ కలుగుతోందంటే మన అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి లో. దసరా పండగ సమయంలో బత్తలపల్లి మండలం లో సాగు చేసే కనకంబరాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి ఊహించిన స్థాయిలో ధరలు పలికాయి. కనీవినీ ఎరుగని రీతిలో ధర లభిస్తుండటంతో కనకాంబరాలు సాగు చేసిన రైతుల్లో ఆనందం నెలకొంది. గురువారం బత్తలపల్లి పూల మార్కెట్ లో పూల ధర కిలో 1,400 పలికింది. గత వారం కిలో కేవలం 150 ఉంటే.. ప్రస్తుతం వాటి ధర 1,400 చేరుకుంది. కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా బోసిపోయిన మార్కెట్ తిరిగి పుంజుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కనకాంబరాలకు డిమాండ్
ఏర్పడింది. బత్తలపల్లి నుంచి విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తారు.