మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పూర్వాంచల్ ఎక్స్‌‌ప్రెస్‌వేపై నారాయణ‌పూర్ గ్రామ సమీపంలో రెండు ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవి రెండూ బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వేగంగా వస్తున్న రెండో బస్సు బలంగా ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ఆసుపత్రిలో బాధితులకు ప్రాథమిక చికిత్స అనంతరం లక్నో ట్రామాకేర్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
Purvanchal Expressway Road Accident, Uttar Pradesh, Double Decker Bus, Road Accident

Leave A Reply

Your email address will not be published.