సినిమాలో నటించిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి… కొంత సమయాన్ని కేటాయించి సినిమాలో నటించారు. కేబీ ఆనంద్ దర్శకత్వం వహించిన సందేశాత్మక చిత్రం ‘అమృత భూమి’లో ఆమె కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని పారినాయుడు నిర్మించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రసాయనాలను వాడటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయని… ప్రకృతి వనరులతో పాటు మనం తినే ఆహారం కూడా రసాయనాలమయం అవుతోందనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు.

దివంగత వంగపండు ప్రసాదరావు ఈ సినిమాకు కథ, పాటలు అందించారు. ఈ చిత్రాన్ని నూజివీడుకు చెందిన వ్యాపారవేత్త, మూల్పూరి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు లక్ష్మణస్వామి నూజివీడు ప్రాంత ప్రజలకు వారం రోజుల పాటు ఉచితంగా చూపించాలని నిర్ణయించారు. సత్యనారాయణ మినీ థియేటర్ లో ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.