నేటి నుంచి కూడవెళ్లి రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు

మాఘ స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు:

దుబ్బాక,: మూడు వాగుల కలయిక కూడవెళ్లి. ఇక్కడ మాఘ స్నానాలు చేయడం కూడవెళ్లివాగులో  ఆచరించడం ఎంతో పుణ్యప్రదం.
హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది.
ఈ నెలలో పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని పౌరాణిక గాధ. అంతేకాకుండా, చదువుల తల్లి సరస్వతి జన్మించినంది కూడా వసంత పంచమి అయిన మాఘ మాసంలోనేని నమ్ముతారు. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్విసిస్తారు. మాఘ మాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు.


ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. ఈ మాసమంతా తెల్లవారు జామున లేచి స్నానం ఆచరించడమనేది నిత్య కృత్యమంటారు.


మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులు ‘ మాఘీ ‘ అంటారు.. కనీసము మూడురోజులయినా నదీ/ సముద్రం చేయాలి. మాఘమాసములో నదీస్నానము చేసి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది.పుణ్య స్నానాలాచరించి దేవుడి సర్వదర్శనం చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఎంతో ప్రవిత్రంగా భావిస్తారు. మండలంలోని రామేశ్వరంపల్లి కూడవెళ్లి రామలింగేశ్వరాలయం మాఘమాస జాతర శనివారం నుంచి ప్రారంభం కానున్నది. అదే రోజు ఆలయ ఉత్సవం దేవుడి ఊరేగింపుతో వైభవంగా ప్రారంభం కానున్నది. శనివారం మాఘమాస పర్వదినం కూడవెళ్లి వాగులో భక్తులు పవిత్ర పుణ్యస్నానాలాచరిస్తారు. తూర్పునుంచి పెద్దవాగు, పడమర నుంచి చిన్నవాగు, మధ్య వాగులతో అనుసంధానంగా కలవడం మూలంగా ఏర్పడిన కూడవెళ్లి వాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. కూడవెళ్లి గుళ్లు ఈ ప్రాంతంలోని లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. ఏటా మాఘ అమావాస్య దినం మొదలుకొని పంచమి వరకు జాతర కొనసాగుతుంది. అయితే ఆలయ పరిసరాల్లో పదిహేను రోజుల ముందు నుంచే ఉత్సవ వాతావరణం నెలకొంది.

వాగులో నీటి నిలువతో పాటు ఆలయ పరిసరాల్లో పర్యాటక శోభ సంతరించుకుంది. శనివారం నుంచి జరిగే కూడవెళ్లి జాతరకు దుబ్బాక, మిరుదొడ్డి, రామాయంపేట, నిజామాబాద్‌ జిల్లా దోమకొండ, భిక్కనూరు, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి, గంభీర్‌రావు పేట, ముస్తాబాద్‌ మండలాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. రైతులు ఇంటిల్లిపాదితో కలిసి రెండు రోజుల ముందు నుంచే ఎండ్ల బండ్లలో వచ్చి వాగు ఒడ్డున విడిది ఏర్పాటు చేసుకుంటారు.

Leave A Reply

Your email address will not be published.