కౌన్ బనేగా కరోడ్ పతి లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్ల వల

 

 

కేబిసి లాటరీ పేరుతో వాట్సాప్ లో మెస్సేజ్ లు వస్తున్నాయా తస్మాత్ జాగ్రత్త.

జిల్లా ఎస్పీ, శ్రీ శరత్ చంద్ర పర్,

అనుదిన వార్త/ 15 మార్చి/మహబూబా బాద్ అర్బన్

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సైటర్. నేరాలలో భాగంగా ‘కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ” పేరుతో వాట్సప్ వేదికగా సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ లలో తెలియని వ్యక్తుల నుండి మెస్సేజ్ లు వస్తున్నాయి. అవి ‘సైబర్ నేరగాళ్ల నుండి వస్తున్నాయి. అని తెలుసుకునే లోపే ఫైబర్ మోసం జరిగిపోతుంది.

మీరు దుబాయి/ముంబై లో నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి లక్కీ డ్రా లో మీయొక్క మొబైల్ నెంబర్ మొదటి బహుమతి గారూపాయలు 25,00,000/- గెల్చుకున్నారు. అవి మీయొక్క వాట్సన్ కి మెస్సేజ్ వస్తుంది. అదేవిదంగా సైబర్ నేరస్తుడు వాట్సప్ నెంబర్ తో లింక్ పంపించి ఆ వెఖర్ తో చాట్ చేయమని చెప్తాడు. మీరు గెల్చుకున్న లాటరీ డబ్బులను తీసుకోవడానికి సర్విస్ టాక్స్ ఇన్ కమ్ టాక్స్ అంటూ కొంత డబ్బులను వాళ్ళు చెప్పిన బ్యాంక్ అక్కౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమంటారు. మీరు డబ్బులు పంపిన వెంటనే ఆ సైబర్ నేరస్తుని మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. కౌన్ బనేగా కరోడ్ పతి లక్ష్కీ డ్రా పేరుతో అలాంటి సందేశం ఏదైనా వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరస్తులు వాట్సప్ లో పంపే కేబిసి లక్కీ డ్రా లాటరీ మోసాల బారినపడకుండా వుండటానికి ఈ . క్రింద ఉదహరించిన మార్గదర్శకాలు పాటించాలని కోరుతున్నాము.మీరు కౌన్ బనేగా కరోడ్ పతి లేదా మీలో ఎవరు కోటిశ్వరులు లాంటి వాటిలో పాల్గొనకుండా బహున్నారని వాట్సప్ లో గాని, టెక్స్ట్ మెస్సేజ్ లో గాని వచ్చినట్లైతే వాటిని పట్టించుకోకండి.

మీరు వాట్సప్ లో కె బి సి లక్కీ డ్రా పేరుతో మెసిజ్ లు వచ్చినట్టైతే, దానిని పట్టించుకోకండి. మెసేజ్ లింక్ ఉంటే దానిపై క్లిక్ చేయకండి. సందేశం పంపిన లేదా కాల్ చేసిన వ్యక్తిని బ్లాక్ చేయండి. తద్వారా మీరు మళ్లీ మోసపోకుండా ఉంటారు. ఫోన్లో లేదా మెసేజ్లో ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వడండి బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా ఖాతా సమాచారాన్ని షేర్ చేయవద్దు.. మీకు తెలియని నంబర్ నుండి ఈ రకమైన మోసపూరిత సందేశం లేదా కాల్స్ వస్తే, పోలీసులకు లేదా సైబర్ సెల్కు ఫిర్యాదు చేయండి మరియు దాన్ని బ్లాక్ చేయండి.

ఒకవేళ ఇటువంటి మోసాలబారిన ఎవరైనా పడితే వెంటనే ఎన్ సి ఆర్ పి పోర్టల్ లో లేదా హెల్ప్ లైన్: 1930 కి కాల్ చేసి పోలీసు వారికి ఫిర్యాదు చేసినట్లయితే వారిని వేధించే సైబర్ నేరగాళ్లపై చర్య తీసుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.