శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి లో వర్గ పోరు

 

* శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిజెపి విజయం సాధించే నా …? !

* బిజెపి నాయకులు ఏకతాటిపై నిలిచేరా…? !

* నాయకత్వ లోపంతో నిర్వీర్యం అవుతున్న బిజెపి.

శేరిలింగంపల్లి అనుదిన వార్త ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకునేందుకు బిజెపి కేంద్ర అగ్ర నాయకత్వం ఉవ్విలురూతున్నారు. అయితే ఈ క్రమంలో రోజురోజుకు బిజెపిలో వర్గ పోరు పెచ్చుమీరుతుంది గత వారం రోజుల క్రితం సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. పార్టీ కోసం ఐక్యమతంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు అయినప్పటికీ వర్గ పోరు మాత్రం తగ్గడం లేదు. దీనిబట్టి చూస్తే అధిష్టానాన్ని మాటలను విశ్మరిస్తున్నారని చెప్పవచ్చు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి బలోపేతం అవుతున్న క్రమంలో నాయకత్వ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు రవికుమార్ యాదవ్ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన గజ్జల  యోగానంద్ కు అప్పట్లో సల్ప ఓట్లు మాత్రమే వచ్చాయి, అయినప్పటికీ అప్పటి నుండి ఇప్పటివరకు ప్రజల్లో ఆయనకు స్పందన అంతంతమాత్రంగానే ఉందని చెప్పవచ్చు అని, కేవలం ప్లెక్సీలకు మాత్రమే పరిమితం అవుతున్నారని కొంతమంది బిజెపి కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. మరో నేత మువ్వ సత్యనారాయణ వాట్సప్ లకు పరిమితం అవుతున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కుమారుడు రవి కుమార్ యాదవ్ పార్టీ బలోపేతం కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తూ సమస్యలను వెలువెత్తుతున్నారు. మిగత వారు మాత్రం తమకేమీ పట్టి పట్టనట్టు ఆయారం గాయరం అన్నట్లుగా పార్టీ అభివృద్ధి విషయం లో ఎక్కడ కూడా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి విజయం సాధించడం అసాధ్యమని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర నాయకత్వం స్పందించి వీరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బిజెపి కిందిస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు. బిజెపి పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగితే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి విజయం సాధించడంలో  నల్లేరు మీద నడికేనని ప్రజలు అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.