కేసీఆర్ రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

 

 

  • నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఈటల

  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్

  • తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు సూచన

  • TSPSC ఛైర్మన్, కమిటీ సభ్యులు రాజీనామా చేయాలి

రాష్ట్రంలో నాలుగు ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. క్వశ్చన్ పేపర్లను కావాలనే లీక్ చేశారా లేక యాదృచ్ఛికంగా లీయ్ అయ్యాయా అనే విషయాన్ని CM KCR చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ KCR, TSPSC ఛైర్మన్, కమిటీ సభ్యులు రాజీనామా చేయాలని అన్నారు. ఈ స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పారు. అప్పులు చేసి, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అన్నారు. తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు సూచించారు. నిరుద్యోగులు మళ్లీ చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని చెప్పారు. పేపర్ లీకేజీపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.