ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర పంచాంగంను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం లో ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పబ్బ మాధవి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పసునూరి పద్మ, మండల అధ్యక్షులు పబ్బ అశోక్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు గంప రవి గుప్తా, కార్యదర్శి పసునూరి ఆంజనేయులు గుప్తా, ప్రధాన కార్యదర్శి ఐత చంద్రశేఖర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం సభ్యులు జిల్లా శ్రీనివాస్ గుప్తా, వెంకటేశం గుప్తా, సాంబయ్య గుప్తా, సముద్రాల శ్రీశైలం గుప్తా, ఐత వీరేశం గుప్తా, డాక్టర్ కిషన్ గుప్తా, విజయ్ కుమార్ గుప్తా, విశ్వనాథ్ గుప్తా, శ్రీరామ్ శ్రీనివాస్ గుప్త, బాలరాజు గుప్తా, నారాయణ గుప్తా, తదితరులు పాల్గొన్నారు..