కాంగ్రెస్ పార్టీ దీక్షను విజయవంతం చేయండి

 

దౌల్తాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో జరిగే దీక్షను విజయవంతం చేయాలని టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దశరథ రెడ్డి లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో జరిగిన హాత్ సే హాత్ జోడోయాత్ర లో ప్రజల సమస్యలు విని పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టే ఒక్కరోజు దీక్షను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారులాలు, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, నాయకులు పడాల రాములు, మల్లేశం, భద్రయ్య, కృష్ణారెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.