బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత!
దౌల్తాబాద్: మండల పరిధిలోని గువ్వలేగి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బోయిని నరసయ్య కుటుంబాన్ని శనివారం ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రజాహిత ఫౌండేషన్ అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు నర్ర రాజేందర్, ఉపసర్పంచ్ రవి, నాయకులు కమ్మరి శ్రీనివాస్ చారి, కలీలుద్దీన్, చింటూ, మురళి, ఆంజనేయులు, సుదర్శన్, స్వామి, సందీప్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు….