హరితహారం కు సరిపడా మొక్కలను పెంచాలి డి ఆర్ డి ఓ గోపాల్ రావు

 

దౌల్తాబాద్: హరితహారం కు సరిపడా మొక్కలను నర్సరీలలో పెంచాలని డి ఆర్ డి ఓ గోపాల్ రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ, ఇందుప్రియాల్ గ్రామాల నర్సరీలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా పాదులు చేసుకుంటూ నీరు పట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, ఎంపీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రీ, ఏపీఓ రాజు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.