నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేత

 

దౌల్తాబాద్: మండల పరిధిలోని గువ్వలేగి గ్రామంలో నిరుపేద కుటుంబమైన లక్ష్మీ, నారాయణ కూతురు సౌందర్య వివాహానికి ఉమ్మడి మండల రైతు రక్షణ సమితి అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్ పుస్తె మట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్, ఉప సర్పంచ్ రవి, తిరుమలాపూర్ ఎంపీటీసీ బండారు దేవేందర్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి గౌడ్, నాయకులు నాగరాజు, నరేష్, యాదగిరి, రాజలింగం గౌడ్, రమేష్, రాజు, సత్తయ్య, సందీప్, సాయిలు, స్వామి, నర్సింలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.