అనగనగా కథలా పోస్టర్ ఆవిష్కరణ

 

  • అనగనగా కథలా పోస్టర్ ఆవిష్కరణ

వర్థమాన నటుడు, విశాఖ వాసి కంచర్ల ఉపేంద్ర నటించిన ‘ అనగనగా కథలా ‘ పోస్టర్ ఆవిష్కరణ శనివారం డాబా గార్డెన్స్, అల్లూరి విజ్ఞాన్ కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో చిత్ర కధానాయకుడు కంచర్ల ఉపేంద్ర, సీనియర్ పాత్రకేయులు నగబోయిన నాగేశ్వర రావు, పాత్రుడు, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షలు బంగారు అశోక్ కుమార్ తదితరులు పాల్గొని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నటుడు ఉపేంద్ర మాట్లాడుతూ తన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఎస్ ఎస్ ఎల్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై, కంచర్ల ఉపేంద్ర, సుబ్బలక్ష్మి, సునీత నిర్మాతలు గా వ్యవహరిస్తున్న చిత్రానికి ఎస్. వి. పసలపూడి డైరెక్షన్ వహించరన్నరు. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. ప్రేక్షకులు తనని ఆదరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.