నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామానికి రూ.5 లక్షల రూపాయల సీసీ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

 

 

నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామానికి రూ.5 లక్షల రూపాయల సీసీ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

మరో 5 లక్షల రూపాయల నిధుల మంజూరుకు ఎమ్మెల్సీ హామీ

:: నిజాంపేట్ మండలం రాంపూర్ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ) నుంచి మంజూరు చేసిన రూ.5 లక్షల రూపాయల నిధులకు సంబంధించిన సీసీ డ్రైన్ పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పంజా విజయ్ కుమార్  కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కి గ్రామ సర్పంచ్ జెల్ల రజిత లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు డప్పు చప్పులు మేళ తాళాలతో ఘనంగా ఆహ్వానం పలికారు.

ముందుగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ని ప్రాచీన చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయానికి తీసుకువెళ్లి గ్రామ సర్పంచ్ దర్శనం చేయించారు.అనంతరం ప్రతిపాదిత సిసి డ్రైన్ నిర్మాణ స్థలానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్సీ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటుగా తన నియోజకవర్గ నిధులనుంచి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నానని రాబోవు ఆర్థిక సంవత్సరంలో మరో ఐదు లక్షలు రాంపూర్ గ్రామ అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక బృంద బృందాల మహిళల కోరిక మేరకు గ్రామ సమాఖ్య భవనాన్ని ఇతర ప్రభుత్వ నిధుల నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. యువకులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడా పరికరాలు ఇప్పించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంజా విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచ్ లు శివ ప్రసాద్ రావు, నాగరాజు, ఎంపీటీసీ రాజా రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగం, బీఆరెస్ నాయకులు బాబు, తిరుపతి, ఉప సర్పంచ్ సంజీవులు, మల్లేష్ యాదవ్, రంజిత్ రాజ్, జాల శ్రీకాంత్ ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జిపి స్వామి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.