నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 21.5 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మరో 20 లక్షల నిధుల మంజూరుకు ఎమ్మెల్సీ హామీ
:: నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ) నుంచి 15 లక్షల రూపాయల, జడ్పీ నుంచి 6.5 లక్షల రూపాయల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. చల్మెడ గ్రామంలో ఎల్లమ్మ గుడి 5 లక్షల రూపాయల సీసీ రోడ్ నిర్మాణం, ఎస్సీ కాలనీలో 5 లక్షల రూపాయల సీసీ రోడ్ నిర్మాణం, పౌడాల వారి సంధిలో 6.5 లక్షల రూపాయల సీసీ డ్రైన్, 5 లక్షల రూపాయల తో అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ నిర్మాణం లను కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పనులను ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారిని ముదిరాజ్ సంఘం వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అభివృద్ధి పనులను ప్రారంభించడానికి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ తల్లి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల, గ్రామ సర్పంచ్ కోరిక మేరకు మరో 20 లక్షల రూపాయల నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంజూరికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంజా విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచ్ లు శివ ప్రసాద్ రావు, నాగరాజు, ఎంపీటీసీ రాజా రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు బాజా నాగరాజు, బైండ్ల లక్ష్మణ్, మాజీ సర్పంచులు నాగరాజు, సంగెపు నారాయణ, మాజీ ఎంపీటీసీ భిక్షపతి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగం, పీఏసీఎస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మెట్టు సిద్దిరాములు, నాయకుడు గుంల మైసయ్య, మత్స్యకార సంఘం అధ్యక్షుడు మెట్టు వెంకటేశం, ఉపాధ్యక్షుడు పిట్ల మహేష్, నాయకులు గుంల కర్రయ్య, బీఆరెస్ నాయకులు బాబు, తిరుపతి, ఉప సర్పంచ్ సంజీవులు, మల్లేష్ యాదవ్, రంజిత్ రాజ్, తదితరులు ఉన్నారు