ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. జీవో 623ను సస్పెండ్ చేసిన హైకోర్టు
వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 623ను సస్పెండ్ చేస్తూ మధ్యంత ఉత్తర్వులను జారీ చేసింది.
కార్యాలయాలకు రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేవారు. పాత జీవోలో ఉన్న అంశాలే ఈ జీవోలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ రంగులన్నీ అలాగే ఉండేలా కొత్త జీవో ఉందని తెలిపారు. దీంతో, జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Tags: Andhra Pradesh,Panchayat Offices,YSRCP Colours